Janasena: వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్‌

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ బీఫామ్‌లు అందజేశారు.

Published : 17 Apr 2024 15:11 IST

అమరావతి: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ బీఫామ్‌లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ, ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెండ్ల మనోహర్‌కు బీఫామ్‌ అందజేశారు. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండో పార్లమెంట్‌ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్‌నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ ప్రజలే దేవుళ్లు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానానికి కృషి చేస్తాం. విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబద్ధులై పనిచేస్తాం. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యత. జనసేన, తెదేపా, భాజపా కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలి. అందరూ కలిసి పనిచేయాలి.. ప్రజల్లోకి వెళ్లాలి. వివాదాలకు తావులేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి’’ అని పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని