Pawan Kalyan: కేసీఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డా: పవన్‌కల్యాణ్‌

భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.

Updated : 08 Dec 2023 13:17 IST

అమరావతి: భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన.. ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం నాకుంది. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని