Pawan Kalyan: జగన్‌ జీవితం.. జైలుకు, బెయిలుకు మధ్య ఊగిసలాడుతోంది: పవన్‌

జైలుకు.. బెయిలుకు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు.

Updated : 11 Apr 2024 22:06 IST

అమలాపురం: జైలుకు.. బెయిలుకు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

‘‘అమలాపురం క్లాక్‌టవర్‌ నుంచి చెబుతున్నా. జగన్‌.. నీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. నిన్ను  జైలుకు పంపిస్తాం. నా సినిమాలు ఆపిన రోజే చెప్పా.. ఎవరు మనల్ని ఆపేదని? మళ్లీ ఈరోజు చెబుతున్నా కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపేది? భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. కోనసీమను కలహాల సీమగా మార్చి.. కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు. జనసేన, జనసైనికులు రాష్ట్ర సంక్షేమం కోసం నిలబడతారు. కూటమి ప్రభుత్వం వస్తుంది .. నాయకుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. జనసేన నుంచి వెళ్లి పోతే నేనేం చేయలేను. కోనసీమ అందాలు చూపించేలా ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌  మాదిరి రైలు పరుగెత్తాలి. హరీశ్‌ను పార్లమెంట్‌కు పంపిస్తే రైలు కూత వచ్చేలా పనిచేస్తాం. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.  వైకాపా పాలన గురించి దళిత సమాజం ఆలోచించాలి. రాష్ట్రంలో 32 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఈ సీఎం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం’’ అని పవన్‌ భరోసా ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని