Pawan Kalyan: కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు జగన్‌ ప్రయత్నించారు: పవన్‌

అందమైన కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు జగన్‌ ప్రయత్నిస్తే.. తాము ప్రేమసీమను చేసేందుకు ప్రయత్నించామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలిపారు.

Updated : 11 Apr 2024 19:32 IST

అంబాజీపేట: అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్‌ చూస్తే.. తాము ప్రేమ సీమగా మార్చేందుకు  ప్రయత్నించామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఎన్డీయే కూటమి ఏర్పడిందన్నారు. త్రివేణి సంగమంలా తెదేపా, భాజపా, జనసేన పనిచేస్తాయన్నారు. కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారన్నారు. రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్‌ చేతుల్లోకి వెళ్లాయని, వాటిని రైతులకు మేలు చేసే విధంగా మారుస్తామన్నారు. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ఉపాధి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని