Pemmasani Chandrashekar: ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతే ఉదాహరణ: పెమ్మసాని

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని సీఎం జగన్‌ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Published : 17 Apr 2024 15:14 IST

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని సీఎం జగన్‌ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను జగన్‌ ధ్వంసం చేశారని, 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడికి వస్తే వాటిని అడ్డుకున్నారని విమర్శించారు.  

‘‘రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. రాజధాని కోసం 20వేల మంది సన్న చిన్న కారు రైతులు భూములు ఇచ్చారు. అభివృద్ధి కోసం ఖర్చు చేసిన రూ.10వేల కోట్లు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్ 5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. రాజధాని నిర్మాణం జరిగితే ఉపాధి లభించేది. కానీ, 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అంబేడ్కర్‌ స్మృతి వనం కోసం కేటాయించిన ప్రాంతాన్ని నాశనం చేసి.. మరో చోట విగ్రహం ఏర్పాటు చేశారు. ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ’’అని పెమ్మసాని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని