AP News: ఎన్నికల ప్రచారానికి అడ్డుతగిలిన మహిళలు.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ

వైకాపా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన్ను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు.

Updated : 23 Mar 2024 16:53 IST

తాళ్లరేవు: వైకాపా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన్ను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 45 రోజుల నుంచి దీక్షలు చేస్తే.. ఈరోజు ఓట్ల కోసం గుర్తుకువచ్చామా అంటూ మహిళలు నిలదీశారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు వారిపై దుర్భాషలాడటంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం గ్రామస్థులకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని