Sharad Pawar: ప్రజల మూడ్‌ మారిపోయింది.. శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు

 ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజల మూడ్‌ ఇప్పుడు మారిందని కేంద్ర మాజీమంత్రి శరద్‌ పవార్‌ అన్నారు.

Published : 03 Apr 2024 00:03 IST

నాగ్‌పుర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్‌పవార్‌ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మూడ్‌ మారిపోయిందని.. ఇప్పుడు అది ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఉందన్నారు. మంగళవారం నాగ్‌పుర్‌లో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా ఆలోచించలేదన్నారు. తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య లోక్‌సభ సీట్ల పంపకం చివరకు ఎలా ఉంటుందన్న అంశంపై ప్రశ్నించగా.. తానేమీ జ్యోతిషుడిని కాదంటూ బదులిచ్చారు.

అమిత్‌ షా చెప్పినా వినని ఈశ్వరప్ప.. రిటైర్మెంట్‌ పక్కన పెట్టి మరీ పోటీ

దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరుచేయడం మంచి విషయమేనన్నారు. ఆయనకు అన్యాయం జరిగిందన్న పవార్‌.. ఇప్పుడు అసలు పిక్చర్‌ బయటకు వస్తుందని తెలిపారు. ప్రకాశ్ అంబేడ్కర్‌ సారథ్యంలోని వంచిత్‌ బహుజన్‌ అఘాడీ పార్టీ మహారాష్ట్రలోని కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంపైనా స్పందిస్తూ.. ‘మహావికాస్‌ అఘాడీ’ ఆయన్ను కావాలనుకుంటోందని చెప్పారు. ఎన్సీపీలో చీలిక వర్గం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? అని అడగ్గా.. భాజపాను ఓడించగలిగే సామర్థ్యమున్న అభ్యర్థులకే ప్రజలు ఓట్లు వేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు.

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీపై తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి ఆయనతో ఉన్న స్నేహ సంబంధాలే కారణమా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని పవార్‌ బదులిచ్చారు. బారామతి సీటు నుంచి తన కుమార్తె సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ పోటీ పడుతున్న వేళ సుప్రియా గెలుస్తారా? అన్న ప్రశ్నకు ‘ఇంకా ఓటింగ్‌ జరగలేదు కదా’ అని సమాధానమిచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఏకపక్షంగా స్థలాల పేర్లను మార్చడంపై స్పందిస్తూ.. భారత ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పవార్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు