మహిళపై దుర్భాషలాడిన పిన్నెల్లి.. ఆలస్యంగా వెలుగులోకి..

ఈవీఎం ధ్వంసంపై పోలింగ్‌ రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓ మహిళ నిలదీశారు.

Updated : 22 May 2024 09:51 IST

రెంటచింతల: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి వీధిరౌడీలా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఆమెపై దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి విధ్వంసకాండ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని