pithapuram: పిఠాపురం నుంచి పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం: వర్మ

పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెదేపా ఇన్‌ఛార్జి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ చెప్పారు.

Published : 24 Mar 2024 17:11 IST

అమరావతి: పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెదేపా ఇన్‌ఛార్జి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ చెప్పారు. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్మ, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ తెదేపా బాధ్యులు సుజయకృష్ణ రంగారావు.. పవన్‌తో సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు పవన్‌కు వివరించారు. పవన్‌ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని నేతలిద్దరూ స్పష్టం చేశారు. త్వరలో పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్టు జనసేన అధినేత తెలిపారు. మూడు పార్టీలు సమన్వయంతో కలసి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని