Rahul Gandhi: పోరాటం చేస్తే.. రైతులను ఉగ్రవాదులన్నారు: ప్రధానిపై రాహుల్‌ విమర్శ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

Published : 25 May 2024 23:05 IST

అమృత్‌సర్‌: మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు మరోసారి విజయం చేజిక్కితే రాజ్యాంగ మార్పు ఖాయమని బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 

‘‘అధికారంలో ఉన్న కీలక నేతలు దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని.. రద్దు చేస్తామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో మరోసారి భాజపా గెలిస్తే.. భారత రాజ్యాంగంపై మోదీ సర్కార్‌ దాడి తప్పదు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు సాధారణమైనవి కావని.. రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. 

మన భూభాగాలను ఆక్రమించారు.. మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ?.. ఖర్గే విమర్శలు

ఒకవైపు ప్రధాని మోదీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంటే.. దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా పోరాడుతోందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా రైతుల కోసం మోదీ సర్కార్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. నల్లచట్టాలను తీసుకొచ్చింది కూడా ఈ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు రైతులను ఉగ్రవాదులని పిలిచారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతుల తీసుకున్న రుణాలను మాపీ చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు