PM Modi: ఝార్ఖండ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పిన మోదీ.. ఎందుకంటే..?

తన గ్యారంటీపై దేశానికి ఉన్న విశ్వాసం కారణంగానే ‘ఈసారి 400 సీట్లు’ అనే నినాదం వినిపిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 01:47 IST

రాంచీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఝార్ఖండ్‌ (Jharkhand)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పారు. సభా ప్రాంగణం చిన్నగా ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించిన మోదీ.. సభకు వచ్చిన వారిలో ఎక్కువ మంది ఎండలోనే నిలబడ్డారని అన్నారు. అలా నిల్చున్న వారి త్యాగం వృథా కాదని పేర్కొన్న ప్రధాని.. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అధికార జేఎంఎం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఏ క్షణమైనా భాజపా తొలి జాబితా.. అభ్యర్థుల్లో మోదీ, అమిత్‌ షా పేర్లు..!

‘‘జేఎంఎం అంటే ‘జమ్‌ కర్‌ ఖావో (గట్టిగా మెక్కడం)’ అని అర్థం. గిరిజనులను కాంగ్రెస్‌, జేఎంఎంలు కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. వారి పిల్లలు, వంశం గురించి ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతుంటే.. మోదీ మాత్రం మీ కుటుంబం, మీ శ్రేయస్సు కోసం చూస్తాడు. మోదీ గ్యారంటీపై దేశానికి ఉన్న విశ్వాసం కారణంగానే ‘ఈసారి 400 సీట్లు’ అనే నినాదం వినిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో రూ.35వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. రైలు, విద్యుత్తు, బొగ్గుకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ రూ.26వేల కోట్లు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు