Nara Lokesh: లోకేశ్‌ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు.

Updated : 20 Mar 2024 10:24 IST

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో ఆయన సహకరించారు. కాన్వాయ్‌లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసి కోడ్‌కు విరుద్ధంగా ఏమీలేదని పోలీసులు నిర్ధరించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేశ్‌ ప్రచారం సాగుతోందని ధ్రువీకరించారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్‌ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ తనిఖీలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని