Chandrababu: జగన్‌.. ఏపీకి అప్పుల అప్పారావులా తయారయ్యారు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. 

Updated : 30 Mar 2024 17:20 IST

నాయుడుపేట: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. పేదలకు రెండు సెంట్లలో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కాలనీలు ఏవీ రద్దు చేయబోమని, అక్కడే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జగన్‌ ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. ఆయన చేసిన అప్పులన్నీ తీర్చాల్సింది ప్రజలేనని చెప్పారు. ప్రజల ఆదాయం పెంచకుండా ఎన్ని పనులు చేసినా వ్యర్థమేనన్నారు. 2014 - 19 మధ్య రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

వాలంటీర్లు ఎవరూ జగన్‌ ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. వారిని తొలగించబోమని, ఆదాయం మరింత పెరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మందుబాబుల బలహీనత జగన్‌కు బాగా అర్థమైందని, అందువల్లే ధరలు పెంచి పేదలను దోచుకుంటున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. నాణ్యమైన మద్యం తెచ్చి పేదల ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు. మద్యం రేట్లూ తగ్గిస్తామన్నారు. తిరుపతి జిల్లా నుంచి అమరరాజా బ్యాటరీస్‌ను తరిమేసిన జగన్‌ను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకు తప్పించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని