Prajwal Revanna: లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్‌ రేవణ్ణకు షాకిచ్చిన ఓటర్లు

జేడీఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన హాసన అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు లోక్‌సభ ఎన్నికల్లో షాక్‌ తగిలింది. 

Updated : 04 Jun 2024 16:24 IST

బెంగళూరు: ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక దౌర్జన్యం కేసు.. హాసన అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు షాక్ ఇచ్చింది. మహిళలపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పాటిల్ ఆయనపై గెలుపొందారు.

సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హాసనలో పోరు ముందు నుంచి ఆసక్తికరంగానే ఉంది. దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జి.పుట్టస్వామి కుటుంబాల మధ్యే అధికారం కోసం పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో వారి మనవళ్లు ప్రజ్వల్, శ్రేయస్ బరిలో నిలిచారు. ఆ నియోజకవర్గానికి ఎన్నిక జరగడానికి కొద్ది గంటల ముందు ప్రజ్వల్‌కు చెందినవిగా చెప్తున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఓటింగ్ పూర్తయిన వెంటనే దౌత్య పాస్‌పోర్టుపై ఆయన విదేశాలకు పారిపోయారు. ఆ తర్వాత వీడియోల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాజకీయంగా విమర్శలకు దారితీసింది. దీంతో జేడీఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సిట్‌ కస్టడీలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో..  40వేలకు పైగా ఓట్ల తేడాతో హాసన ప్రజలు ఆయనను ఓడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని