Prathipati: జగన్‌పై రాయి దాడి ఘటన.. మా అనుమానాలు బలపడుతున్నాయి: మాజీ మంత్రి ప్రత్తిపాటి

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన వ్యవహారంలో తమ అనుమానాలు బలపడుతున్నాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Published : 15 Apr 2024 11:36 IST

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన వ్యవహారంలో తమ అనుమానాలు బలపడుతున్నాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పోలీసుల తీరు అనుమానాలను మరింత పెంచుతోందని చెప్పారు. జగన్‌కు తగిలింది రాయా? ఎయిర్‌ బుల్లెట్టా? అని సందేహం వ్యక్తం చేశారు. దాడిపై పోలీసులు ఇంకా ఎందుకు వివరాలు వెల్లడించలేదని ప్రశ్నించారు. జరిగిన పరిణామాలు మొత్తం వైకాపా ప్రచార డ్రామాగానే కనిపిస్తున్నాయన్నారు. ఆ పార్టీకి విధేయులుగా ఉన్న పోలీసులను తక్షణం ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విపక్షాలకు రక్షణ లేకుండా స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిష్పాక్షిక ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్యానికి విలువేంటని నిలదీశారు.

సీబీఐ విచారణ కోరండి: బొండా ఉమా

జగన్‌ కంటికి నిజంగా గాయమైతే ఆసుపత్రిలో పరీక్షించాలని, మీడియా సమక్షంలో వివరాలు వెల్లడించాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా డిమాండ్‌ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా అని ప్రశ్నించారు. రాయి దాడి ఘటనపై మీడియా ముందు గగ్గోలు పెడుతున్న వైకాపా నేతలు సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని బొండా ఉమా నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని