Purandeswari: ఆ ఫ్లెక్సీలో తప్పే లేదు.. అందుకే రూ.లక్ష బహుమతి: పురందేశ్వరి

యువ‌ మోర్చా నేతపై సీఐ దాడి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు.

Updated : 25 Feb 2024 21:52 IST

అమరావతి: యువ‌ మోర్చా నేతపై సీఐ దాడి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా యువ మోర్చా ఫ్లెక్సీ పెట్టడంలో తప్పు లేదన్నారు. ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, అందులో భాగంగానే ఎయిమ్స్ నిర్మాణానికి ప్రతి రూపాయీ కేంద్రమే ఇచ్చిందని వివరించారు. ఇది తప్పని నిరూపిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని యువమోర్చా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎయిమ్స్ నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, వైకాపా సర్కారు సక్రమంగా నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పక్కనే డంపింగ్‌ యార్డు పెట్టడంతో దుర్గంధం వస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు