Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి

తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

Published : 08 Dec 2023 12:14 IST

భీమడోలు: తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో ఆమె పర్యటించారు. వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవని విమర్శించారు. 

‘‘రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయి. తడిసిన ధాన్యం కొంటామన్న భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి. రంగు మారిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. గోనె సంచులు సకాలంలో రైతులకు అందట్లేదు’’ అని పురందేశ్వరి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని