Raghunandan Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆ నలుగురినీ నిందితులుగా చేర్చాలి: రఘునందన్‌రావు

మాజీ మంత్రి హరీశ్‌రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని భాజపా నేత రఘునందన్‌రావు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా భారాస అధినేత కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, వెంకట్రామిరెడ్డి పేర్లనూ చేర్చాలని డిమాండ్‌ చేశారు.

Published : 02 Apr 2024 15:25 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని భాజపా నేత రఘునందన్‌రావు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా భారాస అధినేత కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, వెంకట్రామిరెడ్డి పేర్లనూ చేర్చాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ మాట్లాడారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై 2014 నుంచే విచారణ చేపట్టాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రూ.మూడున్నర కోట్లు పట్టుకున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టీఫెన్‌ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయని రఘునందన్‌ నిలదీశారు. ఈ విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని