Rahul Gandhi: వయనాడ్‌లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. ఈ ప్రాంత ప్రజలు తనను సొంతవ్యక్తిలా చూసుకున్నారని అన్నారు. 

Updated : 03 Apr 2024 13:47 IST

వయనాడ్‌: లోక్‌సభ ఎన్నికల్లో తన సిటింగ్‌ స్థానం వయనాడ్(కేరళ) నుంచి పోటీచేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంకా గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో భారీ సంఖ్యలో మద్దతుదారులు రాహుల్ చిత్రాలను ప్రదర్శిస్తూ వారిని అనుసరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వయనాడ్‌లో ప్రతివ్యక్తి నాకు ప్రేమ, అభిమానాన్ని అందించారు. సొంత వ్యక్తిలా చూసుకున్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని నేను ఓటర్లుగా భావించను. నా సోదరి ప్రియాంక గురించి ఎలా ఆలోచిస్తానో  మీ గురించి అంతే. అందుకే వయనాడ్‌లో నాకు సోదరీమణులు, తల్లులు, సోదరులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. హస్తం పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాహుల్ ప్రసంగాన్ని అనువదించారు. 

ఇలా పార్టీలోకి వచ్చి... అలా టికెట్‌ పట్టేసి

2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి బరిలోకి దిగిన రాహుల్‌.. సమీప అభ్యర్థి పి.పి.సునీర్‌ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి సీపీఐ తరఫున అనీ రాజా ఇక్కడ పోటీ చేస్తున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీ అయిన సీపీఐ అక్కడ అభ్యర్థిని దించడం చర్చనీయాశంమైంది. ఈ రోజే అనీ రాజా కూడా నామినేషన్ వేశారు. మరోపక్క భాజపా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ను బరిలో దింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు