Rajnath Singh: ఏపీ రాజధాని అమరావతే.. అందులో చర్చే లేదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

వైకాపా సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు.

Updated : 27 Feb 2024 20:15 IST

విజయవాడ: వైకాపా సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని భాజపా శ్రేణులకు కర్తవ్యబోధ చేశారు. విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

రక్షణ వ్యవహారాల్లో భారత్‌ సాధిస్తోన్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందని రాజ్‌నాథ్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభంతో ఈ విషయం చెబుతున్నానన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని పేర్కొన్నారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో ప్రస్తావించగా.. రాష్ట్ర పార్టీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. భాజపా సైతం అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని