Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్‌ కూలడం ఖాయం: కాంగ్రెస్‌ ఎంపీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో భాజపా ఓడితే.. గోవాలోని ప్రమోద్‌ సావంత్‌ సర్కార్‌ కుప్పకూలిపోతుందని కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ అన్నారు.

Published : 01 Dec 2023 01:59 IST

పనాజీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ మాణికం ఠాగూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓడిపోతే గోవాలోని ప్రమోద్‌ సావంత్‌ సర్కార్‌ కూలిపోతుందన్నారు. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ సన్నాహాల్ని సమీక్షించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

భాజపా ఖాతాలోకి రాజస్థాన్‌.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ!

పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో భాజపా ఓడిపోయిన రోజు గోవాలోని ప్రమోద్‌ సావంత్‌ సారథ్యంలోని ప్రభుత్వం పడిపోవడం మీరు చూస్తారు అన్నారు. ‘‘ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలను డబ్బులతో, కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిళ్ల మూలంగా ఏర్పటైంది. భాజపా ఓడిపోయిన రోజు గోవాలో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడం మీరు చూస్తారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దేశం భాజపాను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది’’ అని ఠాగూర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ప్రజాస్వామ్య యుతంగా సరైన సమయంలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు