Andhra news: పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. 

Updated : 19 Apr 2024 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ (తెదేపా), రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా) నామినేషన్ దాఖలు చేశారు.

కొండపి తెదేపా అభ్యర్థిగా డోలా బాలవీరాంజనేయ స్వామి, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), యర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్‌ (తెదేపా), కావలిలో కావ్య కృష్ణారెడ్డి (తెదేపా), నెల్లూరు గ్రామీణం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (తెదేపా), విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్‌ (తెదేపా) తరఫున ఆయన సతీమణి అనూరాధ, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణ్‌ కుమార్‌ (తెదేపా), మంగళగిరి నియోజకవర్గం నుంచి మురుగుడు లావణ్య (వైకాపా) నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు సైకిల్‌పై వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని