కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి

బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ అక్కడ ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 21 May 2024 13:57 IST

నెల్లూరు: బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ అక్కడి కారులో ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రేవ్‌ పార్టీ జరిగిన ఫాంహౌస్‌ యజమాని గోపాల్‌ రెడ్డి.. కాకాణికి మిత్రుడు. ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాణి స్టిక్కర్‌ అక్కడ ఎలా దొరికింది. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలోనూ ఆయనకు సంబంధాలున్నాయి. కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు. సంఘ విద్రోహ శక్తులతో ఆయనకు లింకులున్నాయి’’ అని సోమిరెడ్డి ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని