Bandi Sanjay: కవితకు ఇస్తే..మహిళలకు 33 శాతం టికెట్లు ఇచ్చినట్లే: బండి సంజయ్‌

భారాస నేతల్లో చాలా మంది భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

Updated : 25 Aug 2023 13:43 IST

కరీంనగర్‌: భారాస నేతల్లో చాలా మంది భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సర్వేలన్నీ భారాస ఓడిపోతుందని చెబుతున్నాయని చెప్పారు. భారాస ఎమ్మెల్సీ కవితకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఇస్తే 33 శాతం మహిళలకు టికెట్‌ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు.

అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌! 

‘‘భారాస ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సగం మందికి సీఎం కేసీఆర్‌ బీ ఫామ్‌ ఇవ్వరు. క్యాడర్‌ను కాపాడుకునేందకు ఆయన గిమ్మిక్కులు చేస్తున్నారు. భారాసకు 25 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెప్తున్నాయి. 30 మంది కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ డబ్బులిచ్చి బరిలోకి దించుతున్నారు. హిందువుల ఓట్ల కోసం ఆయన కొత్త నాటకాలు వేస్తారు’’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని