Tamilisai Soundararajan: ప్రొటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు: తమిళిసై

సవాళ్లు, ప్రతిబంధకాలు తనను అడ్డుకోలేవని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

Updated : 08 Sep 2023 17:45 IST

హైదరాబాద్: సవాళ్లు, ప్రతిబంధకాలు తనను అడ్డుకోలేవని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తాను రాసిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఆమె విడుదల చేశారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 

హేళనలు దాటి.. ‘ఉస్మానియా’లో డాక్టర్‌గా ప్రాచి సేవలు

‘‘రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాను. కోర్టు కేసులు, విమర్శలకు భయపడను. ప్రోటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉంది. ఇక్కడ జిల్లాల పర్యటనకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారు. నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. కన్నింగ్‌ ఆలోచనలతో లేను. 

వైద్య రంగంలో ప్రభుత్వం బాగా పని చేస్తోంది. ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ బిల్లు ప్రభుత్వం నుంచి నాకు అందింది. కొన్ని బిల్లుల్లో లోపాల్ని గుర్తించి తిరిగి పంపాను. బిల్లులను తిరిగి పంపడంలో ఎలాంటి రాజకీయం లేదు. జమిలి ఎన్నికలను నేను సమర్థిస్తాను. సీఎం కేసీఆర్‌కు చాలా రాజకీయ అనుభవం ఉంది. కేసీఆర్‌ను చూసి చాలా నేర్చుకున్నాను ’’  అని తమిళిసై అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని