TDP-YSRCP: కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు.

Updated : 18 Apr 2024 12:35 IST

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 12వ వార్డులో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య ఇంటి పక్క నుంచి ఆయన వెళ్తుండగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వాహనాన్ని రోడ్డుకు అడ్డుగా పెట్టారు. దాన్ని పక్కకు తీయాలని కోరగా.. తెదేపా నేత, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రమేశ్‌బాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైకాపా దాడిని ఖండిస్తూ తెదేపా వర్గీయులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ పార్టీ నేతలపై దాడి చేసిన వైకాపా నాయకులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని