TDP: తెదేపాకు తొలి విజయం.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు

ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెదేపాకు తొలి విజయం ఖరారైంది. రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు.

Updated : 04 Jun 2024 12:40 IST

అమరావతి: ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెదేపాకు తొలి విజయం ఖరారైంది. రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన భారీ విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరికి 64,090 ఓట్ల వేల మెజార్టీతో గెలిచారు. ఆయనకు మొత్తం 1,29,060 ఓట్లు రాగా.. ప్రత్యర్థికి 64,970 ఓట్లు వచ్చాయి.

మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో తెదేపా అభ్యర్థుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్‌, రాప్తాడులో పరిటాల సునీత, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌, సంతనూతలపాడులో విజయ్‌కుమార్‌, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా తదితరులు లీడ్‌లో ఉన్నారు. 

తెదేపా కార్యాలయం వద్ద సంబరాలు

రాష్ట్రంలో కూటమి ప్రభంజనంతో అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. జై చంద్రబాబు, జై లోకేశ్‌ నినాదాలతో సందడి చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెదేపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున యువత, మహిళలు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పరస్పరం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని