AP Election Results: ఏపీలో కూటమి సునామీ.. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసి..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ (88)ను దాటేసింది.

Updated : 04 Jun 2024 10:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ (88)ను దాటేసి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు 120కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా కేవలం 15 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైకాపాకు పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే లీడ్‌ రావడం గమనార్హం.

ఓట్ల లెక్కింపు లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు