TDP: జగన్‌, ఆయన బంధువుల అండతో జవహర్‌రెడ్డి భూ కుంభకోణం: బొండా ఉమా

ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Updated : 27 May 2024 13:41 IST

విజయవాడ: ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు.

‘‘సీఎం జగన్‌, ఆయన బంధువుల అండతో సీఎస్‌ జవహర్‌రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. భోగాపురం మండలంలో సీఎస్‌ రూ.2వేల కోట్ల స్కామ్‌ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్‌ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదా?ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవీ?ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఈవో స్పందించనందున జవహర్‌రెడ్డి అక్రమాలపై దిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. సీఎస్‌ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలి. అవసరమైతే హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలి. డీ పట్టాలన్నీ సీజ్‌ చేసి అధికారులందరిపైనా విచారణ జరపాలి. ఆరోపణలు చేసిన వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. సీఎస్‌, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారు. నిజాలు వెలికితీసిన వ్యక్తులను సీఎస్‌ బెదిరిస్తున్నారు. జవహర్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బొండా ఉమా డిమాండ్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు