Devineni Uma: వైకాపా పాలనలో రూ.7 లక్షల కోట్ల దోపిడీ: దేవినేని

ప్రతిపక్ష నేతల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్రాప్‌ చేస్తోందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 12 Apr 2024 19:52 IST

మంగళగిరి: ప్రతిపక్ష నేతల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్రాప్‌ చేస్తోందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెదేపాతోపాటు జనసేన, భాజపా నేతల ఫోన్లనూ ట్యాపింగ్‌ చేస్తున్నారన్నారు. నేతల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ వారి స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి సహా అనేక మంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం అండ చూసుకునే అధికారులు ఈ పనులు చేస్తున్నారన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తర్వాత జగన్‌కు భయం పట్టుకుందన్నారు. వైకాపా పాలనలో రూ.7 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు