ఈ రాయి డ్రామాకు ఎవరిని బలి చేస్తారో: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

సీఎం జగన్‌ది మరో కోడికత్తి డ్రామా అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. కొత్త నాటకానికి ఆయన తెరలేపారని విమర్శించారు.

Updated : 14 Apr 2024 12:15 IST

గుంటూరు: సీఎం జగన్‌ది మరో కోడికత్తి డ్రామా అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. కొత్త నాటకానికి ఆయన తెరలేపారని విమర్శించారు. విజయవాడలో సీఎం జగన్‌పైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు ఆడిన కోడికత్తి నాటకం ఫలితంగా అమాయక దళిత యువకుడు ఐదేళ్లు జైలులో ఉన్నాడన్నారు. ఇప్పుడు ఈ రాయి డ్రామాకు ఏ దళితుడిని బలి చేస్తారోనని వ్యాఖ్యానించారు. ఐ ప్యాక్‌ డైరెక్షన్‌లో ఇంకా ఎన్ని డ్రామాలు చూడాలోనని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి రక్షణ కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతకానితనమన్నారు. ఇది ముమ్మాటికీ ఐ ప్యాక్ ఆధ్వర్యంలో పథకం ప్రకారం జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. గత ఎన్నికల సమయంలో బాబాయ్‌ని చంపించి చంద్రబాబు మీద దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా రక్తపు పునాదుల మీద జగన్ ప్రభుత్వం ఏర్పడిందని సొంత చెల్లెళ్లే చెబుతున్నారన్నారు. ఈ ఘటనతో తమకు సంబంధమేంటని నిలదీశారు. ఎన్నికల్లో లబ్ధికి వైకాపా ఆడుతున్న నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని