TDP: ఈ డ్రామాలో హీరో జగన్‌.. సైడ్‌ హీరో వెలంపల్లి: తెదేపా నేత పట్టాభి

సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్‌లో ముందే స్క్రిప్ట్‌ రాశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

Published : 14 Apr 2024 12:45 IST

అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్‌లో ముందే స్క్రిప్ట్‌ రాశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ఈ డ్రామాలో హీరో జగన్‌, సైడ్‌ హీరో ఎమ్మెల్యే వెలంపల్లి అని ఎద్దేవా చేశారు. ఎవరి పాత్రలను వారు అద్భుతంగా పోషించారన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు దాడి చేయించుకుని తెదేపాపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 

‘‘ప్రజల ఛీత్కారాలతో ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే సానుభూతి కోసం కోడికత్తి తరహాలో డ్రామా ఆడారు. సీఎం కాన్వాయ్‌లో అంబులెన్స్‌ ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లకుండా బస్సులోకి ఎందుకు తీసుకెళ్లారు?అందులో కూర్చోబెట్టి ప్లాస్టర్‌ వేస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు కానీ.. అంబులెన్స్‌ను ఎందుకు ఉపయోగించుకోలేదు? దీనికి సమాధానం చెప్పాలి’’ అని పట్టాభి డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని