తెదేపా నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ఈసీకి పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు

రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలపై బైండోవర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

Updated : 23 Mar 2024 20:16 IST

అమరావతి: రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలపై బైండోవర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. ఈమేరకు శనివారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు

‘‘ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈసీఐ మార్గదర్శకాలు ఉంటే.. క్షేత్రస్థాయిలో పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తెదేపా బృందాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. సస్పెక్ట్‌ షీట్‌ తెరిచి పోలింగ్‌ రోజు స్టేషన్‌లో కూర్చోబెడతామని బెదిరిస్తున్నారు. వైకాపాకు చెందిన వారిపై ఇప్పటికే రౌడీషీట్‌లు ఎత్తివేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు వేసే పరిస్థితి కల్పించాలి. ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోనివ్వకుండా ఒత్తిళ్లు తీసుకురావడం ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధం’’ అని ఈసీ దృష్టికి తెచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని