గంటలో వస్తానన్న పిన్నెల్లి.. ఇప్పుడెక్కడ దాక్కున్నారు?: జూలకంటి

చట్టం, ప్రజాస్వామ్యంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు.

Updated : 23 May 2024 12:01 IST

పల్నాడు: చట్టం, ప్రజాస్వామ్యంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు. గంటలో మాచర్ల వస్తానన్న ఆయన.. ఇప్పుడెక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పరారీ వెనక సజ్జల వంటి పెద్దల సహకారం ఉందని ఆరోపించారు. పోలీసులు కూడా ఆయన పరారీకి అన్నివిధాలా సహకరించారన్నారు. పాల్వాయి, కేపీగూడెం, మాచర్ల దాడులపై నామమాత్రపు సెక్షన్లతో కేసులేంటని ప్రశ్నించారు. కేపీగూడెంలో తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనుల్ని కొట్టారని తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితులను కలిసి న్యాయం చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు