Macherla: పథకం ప్రకారమే అరాచకం.. పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలి: బ్రహ్మారెడ్డి

పల్నాడు జిల్లా మాచర్లలో పథకం ప్రకారమే వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు.

Published : 22 May 2024 19:52 IST

అమరావతి: పల్నాడు జిల్లా మాచర్లలో పథకం ప్రకారమే వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి తెలుగుదేశం నేతలు  దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని బ్రహ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. పాల్వాయిగేటులో మొదటి నుంచి చివరి వరకు అన్ని ఘటనలకు ఎమ్మెల్యేనే బాధ్యుడన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావుపై రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు. పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. దాడులు చేస్తామని పిన్నెల్లి మందే చెప్పాడని, ఆ విధంగానే దాడులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. పోలీసులకు సవాల్‌ విసిరి, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన ఎమ్మెల్యేపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని