TDP: ఆర్టీసీ బస్సులకు తెదేపా నేతల దరఖాస్తు.. తిరస్కరించిన అధికారులు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం తెదేపా-జనసేన తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనుంది.

Updated : 28 Feb 2024 11:45 IST

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం తెదేపా-జనసేన తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీని తెదేపా నాయకులు కోరారు. 100 బస్సులు కావాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, 50 బస్సుల కోసం ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు దరఖాస్తు చేశారు. వారి అభ్యర్థనను అధికారులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కేటాయించలేదని నేతలు మండిపడ్డారు. చేసేదిలేక ఇరుపార్టీల శ్రేణులు సొంత వాహనాల్లోనే సభకు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. లక్షలాదిగా తరలివచ్చే సభకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని