Chandrababu: ఓటు వేసిన వారినే కాటేసే రకం.. జగన్‌: చంద్రబాబు

రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 12 Apr 2024 19:09 IST

కొల్లూరు: రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటు వేసిన వారినే కాటేసే రకం.. జగన్‌ అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలేనన్నారు. దళితుల కోసం పెట్టిన 25 కార్యక్రమాలను రద్దు చేసి, వారిని అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు.

‘‘ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది. ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును ఎంత పూర్తి చేశారు? డయాఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యామ్‌, గైడ్‌ బండ్‌ పోయాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం పెరిగింది. నాసిరకం మద్యం తాగి అనేకమంది ప్రాణాలు పోతున్నాయి. నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి. వైకాపా అరాచకాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ఎన్డీయే అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని