Chandrababu: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ: చంద్రబాబు

 ప్రజలు జగన్‌ బెండ్‌ తీయడం ఖాయమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 

Updated : 30 Mar 2024 20:01 IST

శ్రీకాళహస్తి: ప్రజలు జగన్‌ బెండ్‌ తీయడం ఖాయమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా.. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్‌ది అని విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పదవి ఉంటే ఒదిగి పనిచేసిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. 

‘‘ప్రజాగళం సభలు జనంతో కళకళలాడుతుంటే.. సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి. జగన్‌ ఓ విధ్వంసకారుడు, అహంకారి, అవినీతిపరుడు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశాం. తిరుపతి, చెన్నైలో విమానాశ్రయాలు ఉన్నాయి. నెల్లూరులో కూడా ఓ విమానాశ్రయం నిర్మించాలని భావించా. రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం. మనం పరిశ్రమలు తెస్తే వైకాపా నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం కలిపి టెంపుల్‌ టూరిజం ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాం. స్మగ్లర్లకు వైకాపా టికెట్లు ఇచ్చింది.

తెదేపా హయాంలో కోతలు లేని కరెంట్‌ ఇచ్చాం. ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ మార్చడం జగన్‌ మార్క్‌. తన సామాజిక వర్గానికే డబుల్‌ ప్రమోషన్‌ ఇవ్వడం ఆయన మార్క్‌. ఐదేళ్లుగా గాడితప్పిన పాలనను మేం వచ్చాక సరిచేస్తాం. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అభివృద్ధి అంటే పేదవాడి ఆదాయం పెరగాలి. మద్య నిషేధం అన్నారు.. దానిపైనే రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు. మా హయాంలో సంక్షేమానికి 19.5శాతం ఖర్చు చేశాం. వైకాపా హయాంలో సంక్షేమానికి 13.5 శాతం ఖర్చు చేశారు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని