Tejashwi Yadav: 2024లో జేడీయూ కథ క్లోజ్‌.. రాసివ్వగలను: తేజస్వీ తొలి రియాక్షన్‌ ఇదే..

Eenadu icon
By Politics News Team Updated : 28 Jan 2024 18:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: బిహార్‌లో మహాకూటమి నుంచి జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar) వైదొలగడంతో ‘మహాకూటమి’ ప్రభుత్వం పతనమైన తర్వాత ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) తొలిసారి స్పందించారు. 2024తో జేడీయూ (JUD) అంతం కాబోతుందని వ్యాఖ్యానించారు. నీతీశ్‌కు దార్శనికతలేదని..  ఆయన అలసిపోయిన సీఎం అన్నారు. ఆయనకోసం తామెంతో చేశామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన అసాధ్యమని నీతీశ్ చెప్పినప్పటికీ అది సాధ్యమేనని చెప్పింది తమ పార్టీయేనన్నారు.  ‘‘పర్యాటకం, ఐటీ, క్రీడా రంగాల్లో కొత్త విధానాలు తీసుకొచ్చాం.భాజపా-జేడీయూ పాలనలో 17 ఏళ్లలో చేయలేని పనిని మేం కేవలం 17 నెలల్లో చేశాం. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం 17 మాసాల్లోనే చరిత్రలో నిలిచిపోయేలా పనిచేశాం’’ అన్నారు. 

బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

తాజా పరిణామాలతో తనలో కోపం గానీ, పగ గానీ లేవన్నారు. ‘మహాకూటమి’ని ఆర్జేడీ అనుసరిస్తుందని స్పష్టంచేశారు.  ‘ఇప్పుడే ఆట మొదలైంది.. జరగాల్సింది ఇంకా చాలా ఉంది. నేను ఏం చెబుతానో.. అదే చేస్తా. జేడీయూ పార్టీ 2024తో అంతం కాబోతుందని నేను రాసి ఇవ్వగలను. ప్రజలు మా వైపే ఉన్నారు.. మేం వాళ్లతో ఉంటాం. జేడీయూని తీసుకెళ్లినందుకు భాజపాకు కృతజ్ఞతలు చెప్పాలనుకొంటున్నా..’’ అని వ్యాఖ్యానించారు.

2022లో నీతీశ్ కుమార్‌ ఎన్డీయేను వీడి ఆర్జేడీ-కాంగ్రెస్‌ పార్టీలతో జతకట్టి మహాకూటమి పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తిరిగి ఎన్డీయే కూటమిలో చేరి బిహార్‌లో మరోసారి ప్రభుత్వ పతనానికి కారణమయ్యారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నీతీశ్‌.. భాజపాతో కలిసి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Tags :
Published : 28 Jan 2024 18:22 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు