Gannavaram: తెదేపా మహిళా నేతపై దాడికి యత్నం.. గన్నవరంలో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 22 Mar 2024 19:03 IST

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడకు కారులో వస్తూ గన్నవరంలో వైకాపా ఫ్లెక్సీలను గమనించారు. ఫొటోలు తీసి ఫ్లెక్సీల విషయం సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గన్నవరం వైకాపా అభ్యర్థి వంశీ వర్గీయులు ఆమెపై దాడికి యత్నించారు. మాధవి కారు కదలనీయకుండా వాహనాలు అడ్డుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని