BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా

మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి ఐదురోజులైనా.. భాజపా(BJP) ఇంకా ముఖ్యమంత్రులను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియను కమలం పార్టీ ముమ్మరం చేసింది. 

Updated : 08 Dec 2023 14:13 IST

దిల్లీ: ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో భాజపా(BJP) విజయం సాధించింది. ఫలితాలు వచ్చి ఐదురోజులైనా..  ఆ రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల పేర్లు మాత్రం ఇప్పటివరకూ ఖరారు కాలేదు. దీంతో సీఎంల ఎంపిక ప్రక్రియ కోసం తొమ్మిది మంది పరిశీలకులను పార్టీ నియమించింది. ఒక్కో కమిటీలో ముగ్గురు నేతల చొప్పున మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. వీరిలో ముగ్గురు కేంద్రమంత్రులు కూడా ఉన్నారని కమలం పార్టీ వెల్లడించింది.

రాజస్థాన్‌(Rajasthan) సీఎం ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, నేషనల్ జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే సభ్యులుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌( Madhya Pradesh)కు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌, పార్టీ సీనియర్ నేతలు డా. కె.లక్ష్మణ్‌, ఆశా లక్డా పరిశీలకులుగా ఉన్నారు. వ్యవసాయ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా,  షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్‌, నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను ఛత్తీస్‌గఢ్‌( Chhattisgarh) పరిశీలకులుగా నియమించింది. ఈ పరిశీలకులు మూడు రాష్ట్రాల ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికను జాతీయ నాయకత్వం కూడా పరిశీలిస్తుంది.

మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త ముఖం.. ఐపీఎస్‌ నుంచి సీఎం వరకు ‘లాల్‌దుహోమా’..!

మిజోరం సీఎంగా లాల్‌దుహోమా ప్రమాణం..

మిజోరం(Mizoram) నూతన ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పీఎం) పార్టీ అధినేత లాల్‌దుహోమా(Lalduhoma) శుక్రవారం ప్రమాణం చేశారు. 1989లో రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌ (Congress)లే పాలించిన మిజోరంలో.. తొలిసారి ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM)’ అధికారం చేపట్టింది. రాజభవన్ వేదికగా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని