Amaravati: 3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపాలో చేరిన వైకాపా నేతలు

వైకాపా నేతలు అమరావతిలో 3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 03 Apr 2024 17:15 IST

అమరావతి: వైకాపా నేతలు అమరావతిలో 3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నాలుగేళ్లుగా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైకాపా అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ వల్ల లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. 

చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తమను నమ్మించే యత్నం చేసిందని విమర్శించారు. అభివృద్ధి, వికేంద్రీకరణ తెలుగుదేశం కూటమితోనే సాధ్యమని ఆలస్యంగా గ్రహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనుల్ని ఏకం చేసి తెలుగుదేశం కూటమి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. వైకాపా ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ సెల్ మాజీ అధ్యక్షుడు సంకే విశ్వనాథ్, యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అప్పికట్ల జవహర్ తదితరులు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని