మనసు గాయపడింది.. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా: వైకాపా ఎమ్మెల్యే రక్షణనిధి

తనకు తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో మనసు గాయపడిందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణనిధి (Rakshana Nidhi) అన్నారు. ఒక ఎంపీ చెప్పిన మాట విని, ప్రణాళిక ప్రకారం.. 2 సార్లు గెలిచిన తనకు సీటు లేకుండా చేశారని ఆక్షేపించారు.

Updated : 19 Jan 2024 16:10 IST

తిరువూరు: తనకు తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో మనసు గాయపడిందని వైకాపా ఎమ్మెల్యే రక్షణనిధి (Rakshana Nidhi) అన్నారు. ఒక ఎంపీ చెప్పిన మాట విని రెండు సార్లు గెలిచిన తనకు సీటు లేకుండా చేశారని ఆక్షేపించారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని.. ఎక్కడి నుంచి అనేది త్వరలో తెలియజేస్తానని చెప్పారు. గత పదేళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను తాను దూషించిన సందర్భాలు లేవన్నారు. టికెట్‌ ఇవ్వకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నానన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని