వివిధ పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారు: రేవంత్
తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు
హైదరాబాద్: తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు చెప్పారు. తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. ఆ తరువాత సీఎం కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇవాళ ముగ్గురు నేతలు తనను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారన్నారు. వారిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు, నిజమాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్; జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ముదిరాజ్; భూపాల్‌పల్లికి చెందిన తెదేపా మాజీ నేత గండ్ర సత్యనారాయణలు ఉన్నట్లు వివరించారు. మూడు వర్గాలకు చెందిన నేతలు పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కౌశిక్‌రెడ్డి చిన్న పిల్లవాడు. ఆ మాటలు అతనివి కావు. సీఎం కేసీఆర్ మాట్లాడించినవి. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించం. తెరాసతో కౌశిక్ రెడ్డి టచ్‌లో ఉన్న విషయం నాకు ముందే తెలుసు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి తెరాస టికెట్ ఇస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో తెరాసకు సరైన అభ్యర్థి లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారు. నిన్నటి పెట్రోల్, డీజిల్ పెంపుపై నిరసన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది’’ అని రేవంత్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PBKS vs KKR: పంజాబ్ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు
-
Movies News
Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్
-
General News
Andhra News: ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్