Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender)కు తెలంగాణ హైకోర్టు (TS High Court) నోటీసులు జారీ చేసింది.

Updated : 22 Mar 2024 20:26 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender)కు తెలంగాణ హైకోర్టు (TS High Court) నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సుంకర నరేశ్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో ఓటర్లను దానం నాగేందర్‌ ప్రలోభపెట్టారని కోర్టుకు ఆయన తెలిపారు. డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని