Chandrababu: గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా రాయి విసిరిన ఆగంతకుడు

విశాఖ జిల్లా గాజువాకలో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 14 Apr 2024 20:19 IST

గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.

‘‘నిన్న చీకట్లో సీఎంపై గులకరాయి పడింది. ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే నాపై రాయి విసిరారు. గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ ఈ పని వేస్తోంది. తెనాలిలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారు. విజయవాడలో నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా. గత ఎన్నికలప్పుడు కూడా నాపై రాళ్లు వేశారు. క్లైమోర్‌ మైన్స్‌కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా? నిన్న జగన్‌ సభలో కరెంటు పోయింది. ఎవరు బాధ్యత వహించాలి. కరెంట్‌ బంద్‌ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జగన్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఏం చేస్తున్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీదకు నెట్టాలని ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్‌ కుక్కలు ఇష్టానుసారంగా మొరిగాయి. రాళ్లు నేను వేయించినట్లు కొందరు మాట్లాడారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని