KRMB: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ సహకారం: మంత్రి ఉత్తమ్‌

కేఆర్‌ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రాజెక్టులు అప్పగించలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Published : 05 Feb 2024 20:32 IST

హైదరాబాద్‌: కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ప్రాజెక్టులు అప్పగించబోమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భారాస ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. భారాస అధినేత కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ కుమ్మక్కై పోలింగ్‌ రోజు సాగర్‌ డ్యామ్‌పైకి పోలీసులను పంపించి కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పోలింగ్‌ రోజు వారు అలా చేశారన్నారు.

‘‘కేఆర్‌ఎంబీకి మా ప్రభుత్వం ఇప్పటికీ ప్రాజెక్టులు అప్పగించలేదు. భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కృష్ణా జలాల వాటాల విషయంలో కేసీఆర్‌, జగన్‌ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్‌ సహకరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ సహకారం అందించారు. పాలమూరు ప్రాజెక్టు అంచనాలకు పెంచుతూ పోయారు. రూ.27వేల కోట్లు పెట్టి పాలమూరు ప్రాజెక్టు నిర్మించినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. భారాస పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదు. రూ.95 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఒక బ్యారేజీ కుంగిపోయింది’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని