NDA: వైకాపా మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం.. అభ్యర్థుల్ని అప్రమత్తం చేసిన ఎన్డీయే

ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ పార్టీ నేత అయినా కూటమి అభ్యర్థిగానే భావించాలని అధిష్ఠానం నేతలకు దిశా నిర్దేశం చేసింది.

Published : 16 Apr 2024 21:57 IST

అమరావతి: ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ పార్టీ నేత అయినా కూటమి అభ్యర్థిగానే భావించాలని అధిష్ఠానం నేతలకు దిశా నిర్దేశం చేసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల కూటమి అభ్యర్థులతో తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడు పార్టీల ఓట్లు కూటమి అభ్యర్థికి బదిలీ అవ్వాలని స్పష్టం చేశారు. వైకాపా కుట్రలను 200 మంది కూటమి అభ్యర్థులు దీటుగా తిప్పికొట్టాలని నేతలు సూచించారు. రానున్న రోజుల్లో వైకాపా మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశముందని అభ్యర్థుల్ని అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో 3 పార్టీల నేతలు కలిసి పాల్గొనాలని చంద్రబాబు, పురందేశ్వరి, మనోహర్‌లు తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని