Congress: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి

లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు గట్టి షాక్‌. ఆ పార్టీ నేత, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 30 Mar 2024 13:02 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు గట్టి షాక్‌. జీహెచ్‌ఎంసీ మేయర్‌ జి.విజయలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, భారాస స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే వీరు పార్టీలో చేరనున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని