BRS: వరంగల్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన భారాస

ఎట్టకేలకు వరంగల్‌ ఎంపీ అభ్యర్థిని భారాస ప్రకటించింది. 

Updated : 12 Apr 2024 19:51 IST

హైదరాబాద్‌: ఎట్టకేలకు వరంగల్‌ ఎంపీ అభ్యర్థిని భారాస ప్రకటించింది. మారేపల్లి సుధీర్‌ కుమార్‌ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం సుధీర్‌ కుమార్‌ హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు భారాస వర్గాలు తెలిపాయి. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థి అని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని